1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2022 (11:58 IST)

ధనుష్ కొత్త చిత్రం "సార్" రిలీజ్ డేట్ ప్రకటన

sir movie still
హీరో ధనుష్ వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన తాజాగా నటించిన కొత్త చిత్రం "సార్". డిసెంబరు రెండో తేదీన విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషల్లో నిర్మించారు. 
 
ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశారు. డిసెంబరు 2వతేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రకటన చేస్తూ, అధికారిక పోస్టర్‌ను వదిలారు. క్లాస్ రూమ్‌కి సంబంధించిన ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ఇందులో ధనుష్ సరసన సంయుక్తా మీనన్ నటిస్తున్నారు. 
 
తెలుగు చిత్ర నిర్మాణ సంస్థలైన సితార, త్రివిక్రమ్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే చాలా మేరకు చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చుతున్నారు. రెండు భాషల్లోనూ ఒకే రోజు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.