1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Actress Samanta team clarifies about her Health Problems

సమంతకు అస్వస్థత : ఆ వార్తలు నమ్మొద్దంటున్న బ్యూటీ

Samanta
టాలీవుడ్ హీరోయిన్ సమంత సోమవారం స్వల్ప అస్వస్థతకు లోనైనట్టు సమాచారం. ఆదివారం ఆమె కడపలో పర్యటించారు. ఈ జిల్లా కేంద్రంలో కొత్తగా నెలకొల్పిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె వెళ్లారు. దీంతో ఆమెను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఆ తర్వాత కడప పెద్ద దర్గాలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె... అక్కడ నుంచి ఆమె హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. 

 
హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత ఆమె తీవ్రమైన జలుబు, జ్వరంతో బాధపడటంతో ఆమెను గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక పరీక్షలు చేశారు. అయితే, అంతా బాగానే వుందని, ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలంటూ వైద్యులు సలహా ఇచ్చారు. 

 
అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఆరోగ్యం గురించి పలు తప్పుడు కథనాలు వచ్చాయి. వీటిని సమంత వ్యక్తిగత సిబ్బంది ఖండించారు. సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, కొంచెం దగ్గు ఉండటంతో ఆస్పత్రికెళ్లి చికిత్స చేయించుకున్నారంటూ వివరణ ఇచ్చారు. ప్రస్తుంత సమంత ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్టు చెప్పారు. దీంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
సినీ నటి సమంతకు తీవ్ర అస్వస్థ‌త అని రూమ‌ర్... ఆమె ఓకే!