గురువారం, 18 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 24 నవంబరు 2021 (18:48 IST)

సమంత‌కు పెళ్లయ్యాక కూడా ఎంతో క్రేజీగా... నాకా అవ‌కాశం లేదన్న నిహారిక‌

తాను సినిమాలు చూడడం ప్రారంభించాక పెదనాన్న చిరంజీవి తప్ప ఎవరూ తెలియదని మెగా ఫ్యామిలీ వారసురాలు నిహారిక చెప్పింది. యాక్టర్ గా ఆయనే తనకు స్ఫూర్తి అని ఆమె తెలిపింది. ‘అలీతో సరదాగా’ కార్యక్రమంలో ఆమె తన కెరీర్, పర్సనల్ లైఫ్, ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను పంచుకుంది.
 
 
హీరోయిన్ గా ఎవరూ లేరని చెప్పింది. ఇటీవలి కాలంలో హీరోయిన్లకు పెళ్లి అయినా కెరీర్ ఏం మారడం లేదని, ఉదాహరణకు సమంతేనని చెప్పింది. ఆమెకు పెళ్లయ్యాక కూడా ఎంతో క్రేజ్ ఉందని పేర్కొంది. అయితే, పెళ్లయ్యాక సినిమాలు చేయడం తన భర్త చైతూకు ఇష్టం లేదని, అందుకే సినిమాలు మానేశానని చెప్పింది. పెళ్లికి ముందు ఆయనతో తనకే పరిచయమూ లేదని, పెద్దలు కుదిర్చిన వివాహమని ఆమె తెలిపింది. నైన్త్ క్లాస్ లో తన అన్న వరుణ్ తేజ్ కు క్లాస్ మేట్ అని పేర్కొంది.

 
మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, త‌న తండ్రి గురించి మాట్లాడుతూ, నష్టపోయి అంత కిందకు పడిపోయి, అంతేవేగంగా ఎదగడం తన తండ్రి తప్ప ఇంకెవరూ చేయలేరని తెలిపింది. తనకు, తన తండ్రికి ఖాళీగా ఉండడం అస్సలు నచ్చదని పేర్కొంది. చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ లలో తన తండ్రి నాగబాబు అంటేనే ఎక్కువ ఇష్టమని కామెంట్ చేసింది.