మంగళవారం, 12 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 18 ఆగస్టు 2021 (19:05 IST)

క్రేజీ అంకుల్స్: శ్రీముఖి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా?

అంకుల్స్ అంతా తప్పకుండా చూడాల్సిన సినిమా క్రేజీ అంకుల్స్ అంటున్నారు. అంకుల్స్ మనసులో ఏముంటుందో అలాంటివారికి బుద్ది ఎలా చెప్పారో చూపించిన సినిమా. అమ్మాయి కోసం క్రేజీ అంకుల్స్ చేసే చిల్లర పనులు నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని ట్రెయిలర్ టాక్ చెపుతోంది. ఈ ట్రెయిలర్లో అంకుల్స్ వస్తుంటే శ్రీముఖి తలుపులు తెరుస్తూ కనబడుతుంది.
 
స్టార్ యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ క్రేజీ అంకుల్స్ దెబ్బకి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా అనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు మహిళలను కించ పరిచే విధంగా రూపొందించిన క్రేజీ అంకుల్స్ సినిమా విడుదలను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ మహిళ హక్కుల వేదిక అధ్యక్ష కార్యదర్శులు రేఖ, రత్నాలు డిమాండ్ చేశారు.
 
ఈ మేరకు బుధవారం సోమజిగూడా ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తాజాగా విడుదలకి సిద్దనగా ఉన్న క్రేజీ అంకుల్స్ సినిమా ట్రైలర్‌లోనే మహిళలను కించ పరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. మహిళలను ఆటవస్తువుగా చూపిస్తూ, అసభ్య పదజాలంతో కూడిన సినిమా చూపించడం సరికాదు అన్నారు.
 
కేవలం ట్రైలర్లోనే అంత అసభ్యత ఉంటే ఇక సినిమా మొత్తం ఎలా ఉంటుందో ఊహించవచ్చు అన్నారు. గతంలో కూడా ఇలాంటి సినిమాలు వచ్చాయని, కేవలం డబ్బు సంపాదన కోసమే యావత్ మహిళ జాతిని కించపర్చడం అన్యాయమన్నారు. వెంటనే సినీ నిర్మాత, దర్శకులు, నటీనటులు యావత్ మహిళ లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పి సినిమా విడుదలను నిలిపివేయాల‌ని హెచ్చరించారు. లేకుంటే యావత్ తెలుగు రాష్ట్రాల మహిళ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని చెప్పారు. మొత్తమ్మీద ఈ చిత్రంతో శ్రీముఖి కాస్త వివాదంలో ఇరుక్కున్నట్లయింది.