దేవీ శ్రీ ప్రసాద్ ప్రతిభ చూస్తే ముచ్చటేస్తుంది, నాగార్జున
Devi Sri Prasad, Nagarjuna
అనంతరం నాగార్జున మాట్లాడుతూ.. 'దేవీ శ్రీ ప్రసాద్ రాసి, పాడి, కంపోజ్ చేసిన ఓ పరి పాట హిందీలో అద్భుతమైన విజయం సాధించింది. ఇప్పుడు ఈ పాటను తెలుగులోనూ రిలీజ్ చేశారు. మన తెలుగు వారికి కూడా ఆ పాట కచ్చితంగా నచ్చుతుంది. దేవీ శ్రీ ప్రసాద్ ప్రతిభను చూస్తే నాకు ముచ్చటేస్తుంటుంది. ఇంత మంచి పాటను కంపోజ్ చేసినందుకు దేవీ శ్రీ ప్రసాద్‌కు కంగ్రాట్స్' అని అన్నారు.
ఈ సందర్భంగా దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ నాగార్జున సర్, కమల్ హాసన్ సర్‌లకు థాంక్స్. నా ఈ కష్టంలో వారి సాయం ఎంతో విలువైంది. ఇంటర్నేషనల్ సాంగ్ చేయాలనే నా ఆలోచనను ముందు కమల్ హాసన్ సర్‌తోనే పంచుకున్నాను. ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలతోనే ఈ పాటను పూర్తి చేయగలిగాను. ఆయనకు సంగీతం మీదున్న మక్కువ, నాలెడ్జ్ వల్లే మేం ఇద్దరం ఇంత సన్నిహితంగా మారిపోయాం. అందుకే ఈ పాటను ఆయనే రిలీజ్ చేయాలని నేను కోరుకున్నాను" అని అన్నారు.
ఓపరి పాటకు హిందీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున, కమల్ హాసన్ వంటి వారు తెలుగు తమిళ భాషల్లో ఈ పాటను రిలీజ్ చేయడంతో మరింత మందికి రీచ్ అయి అద్భుతమైన స్పందన లభిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.
