దర్శకుడు బాబీ పూజతో మెగా 154 డబ్బింగ్ మొదలైంది
Director Bobby, Mega 154 Dubbing pooja
మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా మెగా 154 షూటింగ్ చాలా వరకు షూటింగ్ జరిగింది. ఈ చిత్రం ద్వారా నా నుండి కోరుకునే పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్ వుండే చిత్రంగా ఆకట్టుకుంటుంది అని నిన్ననే చిరంజీవి పేర్కొన్నారు. ఆ తర్వాత రాబోయే భోళా శంకర్ లో కూడా మంచి మార్పులతో అద్భుతమైన వినోదం వుంటుంది అని వెల్లడించారు.
శుక్రవారంనాడు షష్టి తిదినాడు ఉదయం 10గంటలకు హైదరాబాద్‌లోని స్టూడియోలో డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. సైరా సినిమా తర్వాత చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటి కథగా దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్నారు. పుష్ప చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇంకా ఈ సినిమాలో రవితేజ, శృతిహాసన్, ప్రకాశరాజ్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం దేవీశ్రీ ప్రసాద్, మాటలుః కోనవెంకట్.