ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2022 (15:01 IST)

వాజ్‌పేయి నిజమైన రాజనీతిజ్ఞుడు : మెగాస్టార్ చిరంజీవి

chiranjeevi
మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి నిజమైన రాజనీతిజ్ఞుడని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పైగా, తనకు లాల్ బహదూర్ శాస్త్రి, వాజ్‌పేయి ఇష్టమైన రాజకీయ నేతలుగా చెప్పారు. మహాత్మా గాంధీ పుట్టిన రోజునే జన్మించిన శాస్త్రి కూడా బాపూజీలాగే తన జీవితాన్ని గడిపారని గుర్తుచేశారు. 
 
ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం "గాడ్‌ఫాదర్". ఇటీవల విడుదలైన మంచి విజయం అందుకుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. ఇందులో చిరుని పూరి ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. 
 
ఈ సినిమా పొలిటికల్ డ్రామా కావడంతో మీకు ఇష్టమైన రాజకీయ నేతలు ఎవరు అంటూ పూరి ప్రశ్నించారు. దీనికి చిరంజీవి ఏమాత్రం ఇబ్బందిపడకుండా ఈ జనరేషన్‌లో ఇష్టమైన నేతలు ఎవరు అంటే తన వద్ద సమాధానం లేదన్నారు. 
 
అయితే, పాత కాలంలో చాలా మంది గొప్ప నేతలు ఉన్నారని, పార్టీలకు అతీతంగా వాళ్లంటే తనకు ఇష్టమని చెప్పారు. శాస్త్రి, వాజ్‌పేయి తనకు ఇష్టమైన నాయకులు అని చెప్పారు. ఈ ఇద్దరి నాయకత్వంలో మన దేశం చాలా పురోగతిని సాధించిందని ఆయన చెప్పారు.