ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (19:54 IST)

చిరంజీవి, రవితేజ కాంబినేష‌న్‌లో మెగా154 టైటిల్ టీజర్ రాబోతుంది

Mega 154 poster
Mega 154 poster
మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర), మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ల క్రేజీ కాంబినేషన్‌ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మెగా154.  ఈ చిత్రానికి సంబధించిన షూటింగ్ హైదరాబాద్‌లో  జరుగుతోంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ లో పోషిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా కమర్షియల్ బొనాంజా అందించడానికి మెగా మాస్ పూనకాలు తెప్పించేలా మెగా154'  రూపుదిద్దుకుంటుంది.
 
ఈ చిత్ర టైటిల్ టీజర్‌ను దీపావళికి విడుదల చేయనున్నట్లు ఇటివలే మేకర్స్ ప్రకటించారు. ఈ రోజు దీనికి సంబధించిన ముహూర్తం ఫిక్స్ చేస్తూ మెగా అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ 24న ఉదయం 11:07 గంటలకు టైటిల్ టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అనౌన్స్ మెంట్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు.  ఎనౌన్స్ మెంట్ పోస్టర్ లో చిరంజీవి మాస్ లుక్  అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. పోస్టర్ పై 'బాస్ వస్తున్నాడు' అని రాయడం అంచనాలని మరింత పెంచేసింది.
 
సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసనశృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.
 
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగా 154కోసం ప్రముఖ నటులు, అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.
 
మెగాస్టార్ చిరంజీవికి అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మెగా 154కి సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.
 
ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.