లండన్ నుంచి జ్ఞాపకాలతో హైదరాబాద్‌కు మహేష్, నమ్రత
సూపర్ స్టార్ మహేష్‌బాబు తన కుటుంబంతో కలిసి విదేశీ యాత్ర ముగించుకుని తిరిగి కొద్ది గంటల క్రితమే హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో దిగారు. ఈ సందర్భంగా బయలుదేరే ముందు లండన్‌లో టెలిఫోన్ బూత్ ముందు కూర్చున్న నమత్ర లండన్ నుండి సీజన్ శుభాకాంక్షలు. కొన్ని గొప్ప జ్ఞాపకాలతో బయలుదేరుతున్నాను అంటూ పోస్ట్ చేసింది. మహేష్ కుటుంబంతోపాటు వారి బంధువులు కూడా వున్న ఫోటీను నిన్ననే పోస్ట్ చేసింది నమ్రత.
హైదరాబాద్ వచ్చాక మహేష్‌బాబు త్రివిక్రమ్ సినిమా షూట్‌లో పాల్గొననున్నారు. ఇంతకుముందు కొంత పార్ట్ చేశారు. అనంతరం తన తల్లి మరణంతో గేప్ తీసుకున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28, 2023 న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.