గరికపాటిపై చిరంజీవి సెటైర్ (video)
ఆమధ్య రాజకీయ నాయకుల ఫంక్షన్ అలైబలై ప్రోగ్రామ్ంలో చిరంజీవి, గరికపాటి నరసింహారావుల మధ్య జరిగిన సంఘటన గుర్తుండే వుంటుంది. అక్కడ పాల్గొన్న నిర్వాహకులకు చెందిన మహిళలంతా చిరంజీవితో ఫొటోల కోసం ఉత్సాహం చూపితే అది తన ప్రసంగానికి అడ్డంకిగా వుందనే నెపంతో కొంచెం ఘాటుగానే గరికపాటి స్పందించారు. ఆ తర్వాత చిరంజీవి ఫ్యాన్స్ గరికపాటికి ఫోన్ చేసి చిరంజీవిగారితో మాట్లాడమని చెప్పడం జరిగింది.
కట్ చేస్తే, శుక్రవారం రాత్రి సీనియర్ జర్నలిస్ట్ ప్రభు ప్రభు "శూన్యం నుంచి శిఖరాగ్రాలకు" అనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరణకు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ నిర్వాహకుల భార్యలు, స్పాన్సర్ల భార్యలు చిరంజీవితో ఫోటోలు దిగేందుకు సెలబ్రిటీల భార్యలు సైతం ఆసక్తి చూపారు. ప్రముఖ నిర్మాతల భార్యలు కూడా అక్కడివి విచ్చేశారు. ఇది గమనించిన చిరంజీవి.. వారు ఇక్కడి లేరుకదా! అంటూ అనడంతో.. అక్కడివారంతా నవ్వుకున్నారు. ఇన్‌డైరెక్ట్‌గా గరికపాటి గురించే అన్న విషయం అక్కడివారికి అర్థమైపోయింది.