కఠినమైన శిక్షలు విధించాలిః మెగాస్టార్ చిరంజీవి
Chiranjeevi
నాలుగేళ్ల పసిబిడ్డ పై స్కూల్లో జరిగిన అత్యాచారం,అఘాయిత్యం నన్ను బాగా కలచివేసింది. ఆటవిక సంస్కృతి నుండి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించడమే కాకుండా, ప్రభుత్వాలు అన్ని విద్యాసంస్థల్లో సి.సి. టీవీ కెమెరాల ఏర్పాట్లకు యుద్ధప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.
భావితరాలకు భరోసా కల్పించడం మనందరి సమిష్టి బాధ్యతగా భావిస్తున్నాను...
