గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2022 (17:37 IST)

మిలియన్ల ఫాలోవర్స్‌లో మ‌హేష్‌బాబు రికార్డ్‌!

mahesh
mahesh
మహేష్ బాబుకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ కోసం కూడా అందరికీ తెలిసిందే. త‌న అప్‌డేట్ కోసం వేలంమ‌ది ఎదురుచూస్తుంటారు. ఆయ‌న సినిమా ప్రోగ్రెస్‌ల‌ను అడుగుతుంటారు. కొన్ని సార్లు సోష‌ల్ మీడియాలో న‌మ‌త్ర స్పందిస్తుంటుంది. తాజాగా  త్రివిక్రమ్ తో తన కెరీర్ లో 28వ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి దీనిపై భారీ అంచనాలు నెలకొనగా మేకర్స్ కొత్త షెడ్యూల్ ని త్వరలో స్టార్ట్ చెయ్యనున్నారు. 
 
తాజాగా  మహేష్ రికార్డు అందుకున్నట్టు తెలుస్తుంది. మహేష్ తన ట్విట్టర్ లో అయితే లేటెస్ట్ గా 13 మిలియన్ మంది ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నాడు. దీనితో అయితే సోషల్ మీడియాలో 13 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్న సౌత్ ఇండియా మొదటి హీరోగా మహేష్ రికార్డు సెట్ చేసాడు. తాజాగా విజ‌య్‌దేవ‌ర‌కొండ వంటివారు కూడా రికార్డ్ క్రియేట్ చేశారు.