శనివారం, 14 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2022 (23:38 IST)

సితార బంగారం.. నాన్నమ్మ కోసం.. నిత్యం వెయ్యిమందికి? (video)

Sitara Gattamneni, pink dress
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార తండ్రికి దగిన కూతురు అనిపించుకుంది. మ‌హేష్ బాబు సినిమాల్లోనే కాక రియ‌ల్ లైఫ్‌లోను హీరో అనే విష‌యం తెలిసిందే. ఆయ‌న ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. 
 
కాగా మహేష్ బాబు మదర్ ఇందిరా దేవి మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాన్న‌మ్మ‌పై ఉన్న ప్రేమ‌తో సితార ఓ మంచి నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. 
 
ఇందిరా దేవి పేరు మీద నిత్యం వెయ్యి మందికి అన్న‌దానం ప్లాన్ చేస్తుంద‌ట‌. అయితే దీని కోసం త‌న తండ్రి ద‌గ్గ‌ర మ‌నీ అడ‌గ‌కుండా సొంత ఖర్చుతో ఈ ఘనకార్యానికి శ్రీకారం చుట్టాల‌ని అనుకుంటుంద‌ట‌. 
 
ఇందుకు సితార అన్న‌య్య గౌత‌మ్ కూడా భాగం కాబోతున్నాడ‌ని టాక్. ఇంత చిన్న వ‌య‌స్సులో అన్నాచెల్లెళ్లు తీసుకున్న ఈ నిర్ణ‌యం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం అవుతుంది.