శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (08:28 IST)

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు చేదువార్త... చార్జీల భారం!

hyderabad metro
హైదరాబాద్ నగరంలోని మెట్రో ప్రయాణికులకు ఇది చేదువార్త. త్వరలోనే మెట్రో రైల్ చార్జీలను పెంచనున్నట్టు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సూచన ప్రాయంగా వెల్లడించింది. చార్జీలను పెంచాలన్న యాజమాన్యం అభ్యర్థనకు కేంద్రం ప్రభుత్వం ఫేర్ ఫిక్స్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. 
 
ఈ  కమిటీ వెంటనే రంగంలోకి దిగి మెట్రో చార్జీల సవరణకు సంబంధించిన తమ అభిప్రాయాలను, సూచనలు, సలహాలను స్వీకరించే ప్రక్రియను చేపట్టింది. ఇందుకోసం నవంబరు 15వ తేదీని గడువు తేదీగా నిర్ణయించింది. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు, నగర వాసులు [email protected] ద్వారా కానీ ఛైర్మన్, ఫేర్ ఫిక్సేషన్ కమిటీ, మెట్రో రైల్ భవన్, బేగంపేట, హైదరాబాద్ 500003 అనే చిరునామాకు పోస్టు ద్వారాగానీ పంపాలని సూచించింది.
 
సాధారణంగా మెట్రో రైలు చార్జీలను పెంచే అధికారం కేవలం మెట్రో రైల్ అడ్మినిస్ట్రేషన్‌కు మాత్రమే తొలిసారి ఉంటుంది. ఆ తర్వాత వాటిని సవరించే అధికారం మాత్రం ఫేర్ ఫిక్సేషన్ కమిటీకే ఉంటుంది. మెట్రో చార్జీలను ఏ మేరకు పెంచాలన్నది ఇంకా నిర్ణయించలేదని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.