సంబంధిత వార్తలు
నాని ఆవిష్కరించిన అశోక్ సెల్వన్ ఆకాశం ట్రైలర్
Ashok Selvan, Sivatmika
రీసెంట్‌గా విడుదల చేసిన ఆకాశం టీజర్‌కి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిలీజ్ సందర్భంగా ఇప్పుడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
అశోక్ సెల్వన్ మూడు డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో కనిపించారు. అతని లైఫ్‌లో మూడు దశల్లోని జీవితాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇదొక ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా. రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక పాత్రలను తీర్చి దిద్దిన తీరు, వాటిని వారు క్యారీ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.
ప్రేమ, మోసం సహా లైఫ్‌లోని ఇతర భావోద్వేగాలు హీరో అశోక్ సెల్వన్ రోలర్ కోస్టర్‌లా ఎలా ముందుకు తీసుకెళ్లాడనేది సినిా అని స్పష్టంగా తెలుస్తోంది. దాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవాలంటే నవంబర్ 4 వరకు ఆగాల్సిందే. ట్రైలర్‌లో విదు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందించిన విజువల్స్, గోపి సుందర్ సంగీత సారథ్యం వహించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి. వేర్వేరు రాష్ట్రాల్లో అందమైన లొకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించినట్లు స్పష్టమవుతుంది.
తర్వాతి కథనం
