మంగళవారం, 16 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2022 (14:44 IST)

హ్యాపీ బర్త్‌డే టు కీర్తి సురేష్ - "వెన్నెల"గా పరిచయం చేసిన దసరా టీమ్

Dasara
Dasara
హీరోయిన్ కీర్తి సురేష్ సోమవారం తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న కొత్త చిత్రం "దసరా"లో ఆమె పాత్రను చిత్ర బృందం రిలీజ్ చేసింది. 'దసరా' మేకర్స్ ఆమెను 'వెన్నెల'గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. 
 
పోస్టర్‌లో కీర్తి సురేష్ పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో పెళ్లి చూపుల్లో కనిపించింది. ఆమె పెళ్లి సమయంలో ఉపయోగించే పసుపు చీరను ధరించివుంది. అలాగే, డప్పుల దరువులకు అనుగుణంగా ఆమె డ్యాన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. 
 
కాగా, ఈ చిత్రంలో నాని, కీర్తి సురేష్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. "దసరా" చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 మార్చి 30న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.