శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (16:45 IST)

ఎలాంటి పాత్రలకైనా సిద్ధం : నటి సురేఖా వాణి

Surekha Vani
ఈ మధ్యకాలంలో సినీ నటి సురేఖా వాణికి సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దీంతో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన అంటే దసరా పండగ రోజున "స్వాతిముత్యం" చిత్రం విడుదలైంది. ఈ సినిమాకి సినీ విమర్శకుల నుంచి పాజిటివ్ కామెంట్స్ రావడంతో చిత్ర బృందం సంబరాలు చేసుకుంటోంది. 
 
ఈ కార్యక్రమంలో నటి సురేఖావాణి కూడా పాల్గొని మాట్లాడుతూ, తనకు సినిమాలో అవకాశం కల్పించిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. సురేఖా వాణి సినిమాలకు గుడ్ బై చెప్పిందని, అందుకే తాను సినిమాల్లో నటించడం లేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయన్నారు. ఇందతా ఒట్టి ప్రచారం మాత్రమేనని చెప్పారు. 
 
తాను సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని, సినిమా ఆఫర్లతో తనను ఎవరూ సంప్రదించడం లేదని వాపోయారు. ఎలాంటి పాత్రలు ఇచ్చినా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు సురేఖావాణి తెలిపారు. కాగా, స్వాతిమృత్యం చిత్రంలో బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలు పోషించారు. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించగా సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.