గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (23:17 IST)

నేనే నా తండ్రికి తలకొరివి పెట్టాను.. సురేఖా వాణి కూతురు

సోషల్ మీడియాలో సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రితకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా హ్యాపీగా కనిపించే వీరిద్దరూ.. ఓ ఇంటర్వ్యూలో తమ బాధను వ్యక్తం చేశారు. బయటికి నవ్వుతూ ఉండే తమ వెనుక ఉన్న బాధ గురించి చాలాతక్కువ మందికే తెలుసని వెల్లడించారు. 
 
తాజాగా ఒక ఇంటర్వ్యూ లో సుప్రీతా తన తండ్రి మరణం సందర్భంగా పడ్డ అవమానాలు కష్టాలు చెప్తూ ఎమోషనల్ అయ్యింది. మా నాన్న చనిపోయాక అమ్మ చాలా రోజులు ఇంట్లోనే బాధపడుతూ ఉండేది. అది చూసి నాకు కూడా బాధగా అనిపించేది. సాధారణంగా ఫ్రెండ్స్ వీకెండ్ పార్టీలు చేస్తుంటారు.
 
అమ్మని ఆ బాధ నుంచి దూరం చేయాలని బలవంతం చేసి పార్టీకి తీసుకువెళ్లాను. ఆ ఫోటోలని షేర్ చేస్తే ఎన్నో కామెంట్స్ చేశారు.  
 
దానికి నా సమాధానం ఒక్కటే.. మా ఇంటి రెంట్, బిల్స్ వీళ్ళెవరూ పే చేయడం లేదు. వీళ్ళ కామెంట్స్ నేనెందుకు పట్టించుకోవాలి అని అన్నారు. ఇక మా నాన్న చనిపోయినప్పుడు మా బంధువుల తీరు దారుణం అంటూ చెప్పుకొచ్చింది.
 
తలకొరివి పెట్టడం మాట అటు ఉంచితే పాడే మోయడానికి కూడా ముందుకు రాలేదు. తానే తన తండ్రికి తలకొరివి పెట్టానని వెల్లడించింది.