శనివారం, 9 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జనవరి 2022 (14:10 IST)

సుప్రిత బాయ్‌ఫ్రెండ్‌ గురించి మీకు తెలుసా?

ప్రముఖ తెలుగు నటి సురేఖా వాణి, కూతురు సుప్రిత బాయ్‌ఫ్రెండ్‌కు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం నెట్టింట చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే సుప్రితకు ఓ నెటిజన్ నుంచి బాయ్ ఫ్రెండ్‌కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. 'సుప్రిత నీ సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్‏ గురించి చెప్పు. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్‏లో ఉన్న అబ్బాయిల్లో ఉన్న నందు నీకేం అవుతాడు. ఆయనే కదా నీ బాయ్ ఫ్రెండ్' అని ప్రశ్నించాడు. 
 
అందుకు సుప్రిత షాకింగ్ రిప్లై ఇచ్చింది. "అవును ప్రతీ అమ్మాయికి అలాంటి ఓ ఫ్రెండ్ కావాలి. ఒక అమ్మాయి, అబ్బాయి స్నేహితులుగా ఉండలేరు అని అందరూ అనుకుంటారు. కానీ మేము మంచి స్నేహితుల్లాగే ఉన్నాం. ఎవరు ఏమనుకున్నా మేం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్. అయినా మీలా అనుమానించే వారందరికి సమాధానం చెప్పుకుంటూ పోతే నా జీవితం సరిపోదు" అంటూ ఘాటుగా స్పందించింది.