సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 జనవరి 2022 (18:53 IST)

కోడలు గొంతు కోసి మామ దారుణ హత్య

మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. ఓ వైపు అత్యాచారాలు మరోవైపు హత్యలు పెరిగిపోతున్నాయి. కోడలు గొంతు కోసి మామ దారుణంగా హత్య చేసిన ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే.. కోటపల్లి మండలం లింగన్న పేటకు చెందిన సౌందర్య (19) అదే ఊరికి చెందిన తిరుపతి కుమారుడు సాయికృష్ణను ఐదు నెలల క్రితం పెళ్లి చేసుకుంది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. పెళ్లైన రెండు నెలలకే సాయికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు.
 
సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లి సౌందర్యను తిరుపతి హత్య చేశాడు. వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి చంపేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.