తెలంగాణాలోని మంచిర్యాలలో ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ సమాచార కేంద్రం
దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో తమ నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా ఐఐటీయన్లు, డాక్టర్లుగా మారాలనుకునే వేలాది మంది విద్యార్థులు కలలను సాకారం చేయాలనే లక్ష్యానికనుగుణంగా దేశంలో అగ్రగామి టెస్ట్ ప్రిపరేషన్ సేవల సంస్థ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్‌ఎల్) తమ మొట్టమొదటి సమాచార కేంద్రాన్ని తెలంగాణా రాష్ట్రం మంచిర్యాలలో 4–47/5, కెనరా బ్యాంక్ పైన, బెల్లంపల్లి చౌరస్తా వద్ద ప్రారంభించింది.
ఈ సమాచార కేంద్రం వద్ద ఆకాష్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో పాటుగా అందించే కోర్సులు తదితర అంశాలకు సంబంధించిన సమాచారమూ పొందవచ్చు. ఆకాష్ వద్ద విద్యార్థులు ఇప్పుడు వైద్య, ఇంజినీరింగ్ కోర్సులతో పాటుగా ఫౌండేషన్ స్థాయి కోర్సులను ఎంచుకోవచ్చు.
ఈ నూతన సమాచార కేంద్రాన్ని వర్ట్యువల్‌గా శ్రీ సందీప్ ధామ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్; శ్రీ అనూప్ అగర్వాల్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్; శ్రీ ధీరజ్ మిశ్రా, రీజనల్ డైరెక్టర్-ఏఈఎస్‌ఎల్ ప్రారంభించగా, భౌతికంగా శ్రీ రవికిరణ్, బ్రాంచ్ మేనేజర్, ఆకాష్ ఇనిస్టిట్యూట్, కరీంనగర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ అధికారులు, ఫ్యాకల్టీ, అతిథులు పాల్గొన్నారు.
కేంద్రం ప్రారంభించిన సందర్భంగా ఆకాష్ చౌదరి, మేనేజింగ్ డైరెక్టర్, ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ మాట్లాడుతూ, ఐఐటీయన్లు, డాక్టర్లుగా మారాలని ఆశిస్తోన్న స్థానిక విద్యార్థులకు ఈ కేంద్రం ఓ వరంగా మారనుందన్నారు. దేశవ్యాప్తంగా తమ నాణ్యమైన బోధన ద్వారా అన్ని ప్రాంతాలకూ చేరువయ్యామంటూ ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్‌లకు ఎంపికైన తమ విద్యార్థులే దానికి నిదర్శనమన్నారు.
నీట్, జెఈఈ పరంగా అత్యుత్తమ సంవత్సరాలలో ఒకటిగా ఆకాష్‌కు 2020 వ సంవత్సరం నిలిచింది. ఈ సంవత్సరం ఏకంగా 84,230 మంది విద్యార్థులు నీట్-యుజీకి ఆకాష్ నుంచి అర్హత సాధించారు. అంతేకాదు తొలి 10 ర్యాంకులలో మూడు ఆకాష్ విద్యార్థులే సాధించారు. వీరిలోనూ షోహిబ్ అఫ్తాబ్, ఆకాంక్ష సింగ్‌లు 720/720 మార్కులు సాధించి వరుసగా 1,2 ర్యాంకులను నీట్ 2020లో పొందారు.
జెఈఈ మెయిన్స్, జెఈఈ అడ్వాన్స్ 2020 పరీక్షలలో సైతం ఆకాష్ విద్యార్థులు తమ సత్తా చాటారు. అంతేకాదు ఎన్‌టీఎస్‌ఈ, పీఆర్‌ఎంఓ, ఆర్‌ఎంఓ తదితర ఒలింపియాడ్స్‌లోనూ ఆకాష్ విద్యార్థులు ప్రతిభ చాటారు. ఆకాష్‌లో చేరగోరు విద్యార్థులు ఇన్‌స్టెంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్‌షిప్ టెస్ట్ (ఐఏసీఎస్‌టీ) లేదంటే ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ పరీక్షలలో పాల్గొనవచ్చు. ఐఏసీఎస్‌టీని 8-12 తరగతి విద్యార్థులకు 90% వరకూ స్కాలర్‌షిప్‌ను ట్యూషన్ ఫీజుపై అందించేందుకు నిర్వహిస్తున్నారు.