గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 జులై 2022 (23:09 IST)

సురేఖావాణి డాటర్ సుప్రిత పెళ్లి చేసుకోబోతోందా?

Surekha vani
సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే నటీమణి సురేఖా వాణి.. ఎప్పటికప్పుడు తన కూతురు సుప్రితతో దిగిన ఫొటోస్, డాన్స్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటుంది. తల్లీకూతుళ్ల ఈ వీడియోలు నెట్టింట తెగ హంగామా చేస్తుంటాయి. ఇదంతా సుప్రితను సినిమాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నమే అనే టాక్ జనాల్లో ఉంది.
 
ఇక సురేఖా వాణి, సుప్రితలు చేసుకునే వీకెండ్ పార్టీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వీలు కుదిరినప్పుడల్లా పబ్ లకు వెళ్లడం, స్నేహితులతో కలిసి చిల్ కావడం లాంటివి చేస్తుంటారు.
 
ఈ నేపథ్యంలో సుప్రీతా కొద్ది రోజుల క్రితం నెటిజన్లకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేసింది. "అతడి ప్రేమకు నేను ఒకే చెప్పాను" అంటూ తన ప్రియుడితో ఉన్న రొమాంటిక్ పిక్ షేర్ చేసింది. దీంతో అందరు సుప్రిత త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతుందని అనుకున్నారు. కాని అది అవాస్తమని తర్వాత చెప్పుకొచ్చింది.
 
ఇంకా ఓ నెటిజన్ నీ పెళ్లి ఎప్పుడు అని అడిగేశాడు. దానికి సుప్రిత వింత సమాధానం చెప్పింది. టైమ్ వచ్చినప్పుడు అంటూ సిల్లీ సమాధానం ఇచ్చింది. దీంతో నెటిజన్స్ కాస్త అప్‌సెట్ అయ్యారు. ఈ అమ్మడు ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.