గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2022 (23:16 IST)

పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని వుంది : నటి తమన్నా (video)

Tamannah Bhatia
చిత్రసీమలో అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన తమన్నా... ఈ మధ్యకాలంలో నటనకు ప్రాధన్యత ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుని ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం "బబ్లీ బౌన్సర్" చిత్రంపై గంపెడాశలు పెట్టుకోగా అది తీవ్ర నిరాశకు గురిచేసింది. అలాగే, తెలుగులోనూ ఆమె హిట్ చూసి చాలా కాలమే అయింది. దీంతో సూపర్ స్టార్ రజనీకాంత్‌ నటిస్తున్న జైలర్ చిత్రంలో ఈ మిల్కీ బ్యూటీ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో తమ వివాహంపై స్పందించారు. "ఇన్నాళ్లూ సినిమాలతో బిజీగా ఉండిపోవడంతో పెళ్లి ఆలోచన రాలేదని, ఇపుడు పెళ్లి చేసుకుని పిల్లన్ని కనాలని వుందని మిల్కీబ్యూటీ తమన్నా అన్నారు. పైగా, తాను పెళ్లికి వ్యతిరేకిని కాన్నారు. వివాహ, వైవాహిక బంధంపై తనకు ఎంతో నమ్మకం గౌరవం ఉంది" అని చెప్పారు.