1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 అక్టోబరు 2022 (17:13 IST)

బంధువులబ్బాయి.. కోటీశ్వరుడు.. పెళ్లి చేసుకో సమంత.. నో చెప్పింది?

Samantha
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత చైతూతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విడాకుల తర్వాత సినీ ఆఫర్లతో ఆమె బిజీ అయినప్పటికీ.. వ్యక్తిగతంగా ఆమె కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిసింది. అంతేగాకుండా తీవ్ర ఒత్తిడికి గురైంది. దీంతో ఆమెను ఒత్తిడి నుంచి బయటపడవేసేందుకు సద్గురు జగ్గీవాసుదేవ్ రెండో పెళ్లి చేసుకోమని చెప్పినట్లు వార్తలు వచ్చాయి.


సమంత రెండో పెళ్లి చేసుకోవడం ద్వారా గత జీవితం నుంచి వెలుపలికి వస్తుందని సద్గురు హితవు పలికినట్లు తెలుస్తోంది. దీంతో సమంత ఇంటివారు ఆమెకు సంబంధాలు చూడటం మొదలెట్టారని టాక్.


తాజాగా సమంత కోటీశ్వరుడిని చేసుకోబోతుందని ప్రచారం నడుస్తుంది. కానీ ఆ సంబంధానికి నో చెప్పినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. సమంత తల్లి బంధువులబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుందట.


అతను బాగా కోటీశ్వరుడు కాగా, ఇది అతనికి రెండో పెళ్లి అవుతుందట. అయితే సమంత ఈ సంబంధాన్ని సున్నితంగా తిరస్కరించిందట. ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పినట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.