శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (16:49 IST)

బస్టాపులోనే విద్యార్థినికి తాళి కట్టిన మైనర్ బాలుడు.. అరెస్టు

minors marriage
తమిళనాడులో ఓ మైనర్ బాలిక మెడలో మరో మైనర్ విద్యార్థి తాళికట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. దీంతో పోలీసులు ఆరా తీసి ఈ ఇద్దరు విద్యార్థులను స్టేషన్‌కు తరలించి చర్యలు తీసుకున్నారు. మైనర్ బాలిక మెడలో తాళికట్టిన మైనర్ బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా చిదంబరం తాలూకాని గాంధీ బస్టాండు వద్ద జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిదంబరం తాలూకాలో ఓ బస్టాండులో బాలిక మెడలో ఓ బాలుడు తాళి కట్టే వీడియో ఒకటి వైరల్ అయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో తాళికట్టిన బాలుడు పాలిటెక్నిక్ కాలేజీలో విద్యాభ్యాసం చేస్తుండగా, బాలిక మాత్రం 12వ తరగతి చదువుతుంది. 
 
వీరిద్దరి వద్ద పోలీసులు విచారణ జరిపిన తర్వాత మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ బాలుడుని జువైనల్ హోంకు తరలించారు. ఈ కేసు తమిళనాట సంచలనంగా మారింది.