1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Samantha tshirt viral in social media

సమంత వేసుకున్న టీషర్టు.. అసలు ఏముంది?

Samantha
సమంత వేసుకున్న టీషర్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తన పెంపుడు కుక్క ఫోటోని షేర్ చేస్తూ "డౌన్ బట్ నాట్ అవుట్" అంటూ అనారోగ్యంగా ఉన్నాను కానీ సినిమాల నుంచి పూర్తిగా తప్పుకోలేదు అని గట్టిగానే స్టేట్మెంట్ ఇచ్చింది సమంత. తాజాగా ఇప్పుడు మళ్లీ అలాంటి ఒక గుప్తమైన ట్వీట్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
 
"ఒకవేళ మీరు ఇది కూడా వినాలి అనుకుంటుంటే" అని క్యాప్షన్ పెట్టిన సమంత ఒక ఫోటోని సోషల్ మీడియా ద్వారా అప్లోడ్ చేసింది. ఈ ఫోటోలో సమంత వేసుకున్న బట్టలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ ఫోటోలో ఆమె వేసుకున్న టీ షర్టు పైన "నువ్వెప్పుడూ ఒంటరిగా నడవవు" అని రాసి ఉంది. దీంతో సమంత రెండవసారి ప్రేమలో పడిందా అని సర్వత్ర ఆసక్తి నెలకొంది. 
 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
అంజలి బాగా సన్నబడిందే.. చెర్రీ సినిమా లుక్ లీక్