గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 అక్టోబరు 2022 (09:49 IST)

మైలాపూర్ మార్కెట్‌లో విత్తమంత్రి నిర్మలమ్మ.. ధరలు చూసి షాక్!

nirmala sitharaman
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా కూరగాయల మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేశారు. అక్కడ కాయగూరల ధర చూసి ఆమె ఒకింత షాక్‌కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది, 
 
చెన్నై, మైలాపూరులోని కూరగాయల మార్కెట్‌కు ఆమె శనివారం వెళ్లి, కూరగాయలు కొనుగోలు చేస్తూ కూరగాయల వ్యాపారులతో సంభాషిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వర్గాల సమాచారం ప్రకారం, మంత్రి నిర్మలా సీతారామన్ చెన్నైలోని మైలాపూర్ కూరగాయల మార్కెట్‌ను సందర్శించి విక్రేతల నుండి కొన్ని కూరగాయలను కొనుగోలు చేశారు. విక్రేతలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నిర్మలా సీతారామన్ కార్యాలయం వీడియోను షేర్ చేసింది.