శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2022 (11:54 IST)

హైపర్ ఆదికి పెళ్లి.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

hyper aadi
జబర్దస్త్ షోలో కంటెస్టెంట్ గా తెలుగు తెరకు పరిచయమైన హైపర్ ఆది ఈ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపును సొంతం చేసుకున్నారు.  అంతేకాదు అప్పుడప్పుడు సినిమాలలో కూడా నటించే ఆది పంచులకు విపరీతమైన ఆదరణ ఉంది. ఇదిలా ఉండగా వివాహం ఎప్పుడు చేసుకోబోతున్నాడు అనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి.
 
కానీ గత కొన్నాళ్ళ క్రితం యాంకర్ వర్షిణితో ప్రేమాయణం నడుపుతున్నాడని వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు సోషల్ మీడియాలో ఇప్పటికే అనేకసార్లు హైపర్ ఆది లవ్ , మ్యారేజ్ గురించి బోలెడు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 
 
ఈ క్రమంలోనే తాజాగా హైపర్ ఆదికి నిశ్చితార్థం అయ్యిందని, అది కూడా ఒక స్టార్ హీరోయిన్ తో అనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక షోలో హైపర్ ఆదికి ఒక హీరోయిన్ తో నిశ్చితార్థం జరిగినట్లు చూపించారు. 
 
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఈటీవీలో ప్రతి బుధవారం డాన్స్ రియాల్టీ షో ఢీ ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 14వ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం టీం లీడర్లు , జడ్జిల మధ్య లవ్ ట్రాక్ ఉన్నట్లు చూపించడం కామన్ అయిపోయింది. 
 
ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 19వ తేదీన ప్రసారం కాబోయే ఎపిసోడ్లో టీం లీడర్ హైపర్ ఆదికి, హీరోయిన్ శ్రద్ధదాస్ కి ఎంగేజ్మెంట్ అయినట్లు ప్రోమో కట్ చేసి వదిలేశారు షో నిర్వాహకులు. ఇక హైపర్ ఆది , శ్రద్ధదాస్ మధ్య ప్రేమ ఉన్నట్లు ఒక సాంగ్ కి డాన్స్ కూడా చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.