ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2022 (13:56 IST)

రకుల్ ప్రీత్ సింగ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. లవ్‌స్టోరీకి ఏడాది..

Rakul preet singh
Rakul preet singh
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు నేడు పుట్టినరోజు. దీంతో ఆమెకు నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ ఈ రోజు తన 32వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జాకీ భగ్నానీతో ఆమె రిలేషన్ షిప్ అధికారికంగా ప్రకటించి ఏడాది పూర్తి చేసుకుంది.
 
అప్పటి నుండి, ఇద్దరూ కలిసి బహిరంగంగా కనిపించారు. తద్వారా వార్తల్లో నిలిచారు. ఒక న్యూస్ పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, రకుల్ ప్రీత్ సింగ్ తమ ప్రేమ కథ సహజంగా, సాధారణమైందని చెప్పింది. మొదటి 2-4 నెలలు ఇద్దరూ ఒకరితో ఒకరు మాత్రమే మాట్లాడుకున్నాం. లాక్ డౌన్ కాలంలో తమ మధ్య ప్రేమ తొంగిచూసింది. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టామని..  ఇద్దరికీ వివాహం మాత్రం ఇప్పుడే కాదని చెప్పింది. 
 
గత సంవత్సరం నటి రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు ప్రత్యేక సందర్భంలో జాకీ భగ్నాని ఆమెతో తన సంబంధాన్ని ఇన్‌స్టాగ్రామ్-అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ జంట చేతులు పట్టుకున్నట్లు చూపించే ఫోటోను పంచుకుంటూ, భగ్నానితో ప్రేమలో వున్నట్లు పోస్టు చేశాడు. 
 
ఈ సందర్భంగా "మీరు లేని రోజులు రోజులుగా అనిపించవు. మీరు లేకుండా, అత్యంత రుచికరమైన ఆహారం తినడం సరదా కాదు. నాకు ప్రపంచం అంటే చాలా అందమైన ఆత్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎప్పటికీ చిరునవ్వుతో వుండండి అంటూ.." రాసుకొచ్చారు. 
 
రెండు నెలల తర్వాత జాకీ భగ్నాని పుట్టినరోజు ప్రత్యేక సందర్భంలో, రకుల్ ప్రీత్ సింగ్ భగ్నానీ  ఫోటోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఇంకా ఆమె భగ్నాని కోసం హృదయపూర్వక రొమాంటిక్ నోట్‌ను కూడా రాసింది. 
 
"హ్యాపీ హ్యాపీ బర్త్ డే మై సన్‌షైన్. మీరు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి." అంటూ తెలిపింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ లవ్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.