మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (11:36 IST)

డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న రకుల్ ప్రీత్ సింగ్

Rakul
టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో రెండు సినిమాలతో ట్రీట్ ఇవ్వనుంది. అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రాలతో కలిసి రకుల్ నటించిన 'థ్యాంక్ గాడ్' మూవీ అక్టోబర్ 25న విడుదల కాబోతోంది. ఇందులో రకుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఆమె లుక్ ఆకట్టుకుంది. 
 
రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ కూడా ఇంటరెస్టింగ్‌గా ఉండటంతో ఈ సినిమా కోసం రకుల్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇంతలోనే ఆమె యాక్ట్ చేసిన మరో మూవీ రిలీజ్‌కి రెడీ అయిపోయింది.
 
ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా అనుభూతి కశ్యప్‌ తెరకెక్కిస్తున్న 'డాక్టర్‌ జి'లో ఫిమేల్‌ లీడ్‌గా నటించింది రకుల్. ఆయుష్మాన్ గైనకాలజిస్ట్‌గా కనిపించనున్నాడు. 
 
రకుల్‌ మెడికల్ స్టూడెంట్ పాత్రను పోషించింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 14న విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించుకున్నారు.