శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 జూన్ 2022 (19:59 IST)

రకుల్ ప్రీత్ సింగ్ కొత్త ఫార్ములా.. వర్కౌట్ అవుతుందా?

Rakul Preet singh
Rakul Preet singh
జీరోసైజ్‌తో మతిపోగొడుతోంది రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ యోగాసనం వేస్తూ ఇన్నర్ దుస్తులు కనిపించేలా డ్రెస్ వేసింది. పలుచటి దుస్తులలో రకుల్ అందచందాలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. 
 
ఈ ఫోటోలు చూసిన నెటిజన్లంతా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎంత కష్టమొచ్చింది రకుల్‌.. సినిమాలు లేక ఇలా ఫొటో షూట్స్‌తో కాలం గడుపుతున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజానికి టాలీవుడ్‌లో ఆమెకు పెద్దగా అవకాశాలు లేవు.  దాంతో అటు బాలీవుడ్, కోలీవుడ్ పై గట్టిగా ఫోకస్ పెట్టింది రకుల్.
 
సొషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటే బాలీవుడ్‌లో బాగా వర్కౌట్ అవుతుంది అని భావిస్తోంది రకుల్. అందుకే రెచ్చిపోయి ఫోటో షూట్స్‌తో ఫ్యాన్స్ ను అల్లాడిస్తోంది. మరి ఈ ఫార్ములా ఆమెకు ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.
 
ప్రస్తుతం ఆమె చేతిలో  మిషన్‌ సిండెరెల్లా,  డాక్టర్‌ జీ , థ్యాంక్‌ గాడ్‌ , ఛత్రివాటితో పాటు అయలాన్‌ అనే తమిళ సినిమా ఉంది.