ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 జూన్ 2022 (12:45 IST)

నెట్టింట వైరల్ అవుతున్న నమిత సీమంతం ఫోటోలు

Namita
Namita
అందాల రాశి నమిత ప్రెగ్నంట్ అనే విషయం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తన బేబీ బంప్ ఫొటోలను కూడా నమిత ఇటీవల అభిమానులతో పంచుకోవడం తెలిసిందే. 
 
సొంతం చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ బొద్దుగుమ్మ మొన్నటి సింహా చిత్రంలోనూ విశేషంగా అలరించింది. నమిత 2017లో తన బాయ్ ఫ్రెండ్ వీరేంద్ర చౌదరిని పెళ్లాడింది. 
 
ఇటీవల ఆమె గర్భవతి కాగా, తాజాగా సీమంతం జరుపుకుంది. నమిత సీమంతం ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె సీమంతం కార్యక్రమానికి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా భర్త వీరేంద్ర చౌదరితో కలిసి దిగిన ఫొటోలను, బేబీ బంప్ ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 41 ఏళ్ల వయసులో నమిత తల్లి కాబోతుండటం గమనార్హం.