ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జూన్ 2022 (16:18 IST)

ప్రభాస్ కోటి రూపాయలు ఇస్తానన్నారు.. అది జరిగివుంటే..?: నటి హేమ

Hema
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి సీనియర్ నటి హేమ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అయ్యాయి.మా అసోసియేషన్‌కు నిధుల సేకరణ గురించి ప్రభాస్‌ను కలవడానికి వెళ్లామని నటి హేమ తెలిపారు. ప్రభాస్‌ను అమెరికాలో ఈవెంట్‌కు రమ్మన్నామని.. కానీ ప్రభాస్ పెద్ద మనసుతో కోటి రూపాయలు తాను అసోసియేషన్ ఇస్తానని గొప్ప మనసుతో చెప్పాడని హేమ తెలిపింది. అయితే కోటి ఇవ్వడం కంటే మీరు వస్తే మరో రెండు కోట్లు వస్తాయని.. రావాలని ఒప్పించామని హేమ తెలిపారు.
 
ప్రభాస్ మాత్రమే కాదు.. మహేష్ బాబు కూడా వస్తానన్నారని.. ఈ కార్యక్రమం జరిగి ఉంటే మా అసోసియేషన్‌కు ఆర్థిక కష్టాలే ఉండేవి కావని తెలిపారు. కానీ అది జరగకుండా మా అసోసియేషన్ లో ఓ కార్యదర్శి వివాదాలు రాజేసి అసలు ఫంక్షన్లే జరగకుండా చేశాడని.. అది ఎవరో మీకు తెలుసు అని.. అతడి వల్లే అసోసియేషన్ సర్వ నాశనమవుతోందని హేమ వాపోయారు.
 
మా అసోసియేషన్ కు వచ్చే ఆదాయం రూ.3 లక్షలని.. కానీ ఖర్చు మాత్రం 20 లక్షలు చేస్తున్నారని.. ఇది దారుణం అని మా అధిష్టానంపై హేమ నిప్పులు చెరిగారు.