ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 జూన్ 2022 (19:10 IST)

డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు : కోడికత్తి మాదిరిగానే..?

DL Ravindra reddy
DL Ravindra reddy
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కడప జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి హత్యను రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని ఆరోపించారు. 
 
కోడికత్తి మాదిరిగానే వివేకా హత్య కేసును రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకున్నారని డీఎల్ వ్యాఖ్యానించారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులకు హత్యతో సంబంధం ఉందని డీఎల్ మరింత కీలక వ్యాఖ్యలు చేశారు.  
 
ఇక రాష్ట్రంలో కొనసాగుతున్న వైసీపీ పాలనపైనా డీఎల్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.

వివేకా హత్య కేసును కూడా రివర్స్ పాలనలోనే నడిపిస్తున్నారని తెలిపారు. ప్రజలకు మంచి చేయగలిగితేనే సామాజిక న్యాయం వస్తుందని డీఎల్ చెప్పారు.