సంబంధిత వార్తలు
- అమిత్ షా: ‘తెలంగాణ నిజాంను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పీకి పారేస్తాం’
- రియాల్టీ షో పేరుతో ఏదైనా చూపిస్తారా? హైకోర్టు ప్రశ్న
- రష్మిని గేటుకి కట్టేసి కొడతానన్నా, నేను చొంగ కార్చుకునే రకం కాదు: నిర్మాత బాలాజీ
- తెలంగాణ గవర్నర్ తమిళసైతో కేఏ పాల్ భేటీ: రేపోమాపో కేసీఆర్ అరెస్ట్ ఖాయం అంటూ మీడియాతో...
- గవర్నర్‌పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. కారణం ఏమిటి?
'కోమటిదానిలెక్క' అంటూ నోరు జారిన జీవిత..
సినీ నటి జీవిత కుల వివాదంలో చిక్కుకున్నారు. కులాన్ని కించపరచడంతో జీవిత రాజ్ శేఖర్ చిక్కుల్లో పడ్డారు. జీవిత నోరు జారి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈసారి జీవిత నోట ఒక కులానికి సంబంధించిన మాట రావడం ఆమెను మరోసారి వార్తల్లో నిలబెట్టింది.
రాజశేఖర్ హీరోగా రూపొందిన శేఖర్ మూవీ విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా శేఖర్ మూవీ ప్రి రీలిజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. రాజశేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్ కుబ్చందానీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను రాజశేఖర్ సతీమణి జీవిత స్వయంగా డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక రాజశేఖర్ ఈ సినిమాలో హీరో కాగా, జీవిత ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇక వీళ్ల ఇద్దరు కూతుళ్లయిన శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరించారు.
ఈ నేపథ్యంలోనే శేఖర్ మూవీ ప్రి రీలిజ్ ఈవెంట్‌లో ఈ క్రమంలోనే.. మీ ఇద్దరిలో ఎవరు దేనిపై ఎక్కువ ఖర్చు పెడతారు అనే ప్రశ్న రాగా.. శివాని, శివాత్మిక ఇద్దరూ '' ఫుడ్ '' అనే సమాధానం ఇచ్చారు.
అయితే, ఆ ఇద్దరిలోనూ ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ ఖర్చు పెడతారు అనే ప్రశ్నకు జీవిత స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలే ఆమెను నోరుజారేలా చేశాయి. 'కోమటిదానిలెక్క' అంటూ నోరు జారారు. వాళ్లు డబ్బులు ఇచ్చేవరకు ఊరుకోదని జీవిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి.
తర్వాతి కథనం
