గవర్నర్‌పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. కారణం ఏమిటి?
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ గవర్నర్ తమిళిసైపై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గవర్నర్ అత్యుత్సాహం చూపిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసేలా గవర్నర్ ప్రవర్తిస్తున్నారని కేబినెట్ భేటీ సందర్భంగా కేసీఆర్ మంత్రులతో చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేదు అన్నట్లుగా ఆమె వ్యవహార శైలి ఉందని కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది.
అసలు గవర్నర్, సర్కార్ మధ్య దూరం పెరగడానికి కారణం కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటును గవర్నర్ నిరాకరించడమే అన్న సంగతి తెలిసిందే.
రాజ్ భవన్‌లో గణతంత్ర వేడుకలకు సీఎం సహా ప్రభుత్వం దూరంగా ఉండడం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ లేకుండానే ప్రారంభించడం, ఆమె మేడారం కి వెళ్ళిన ప్రోటోకాల్ పాటించకపోవడం, వంటి ఘటనలు జరిగాయి.