ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (19:05 IST)

తెలంగాణ సీఎం ప్రెస్ మీట్.. కేబినెట్ నిర్ణయాలు వెల్లడి

kcrcm
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎం, మంత్రులు చర్చించి ఆమోదముద్ర వేశారు. 
 
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను మరోసారి నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. రూ.1658కోట్లతో చెన్నూరు ఎత్తిపోతలు నిర్మించాలని సీఎం, మంత్రులు నిర్ణయించారు. 
 
చెన్నూరు ఈ ఎత్తిపోతల పథకంతో ఐదు మండలాల్లోని 103 గ్రామాలకు తాగు, సాగునీరు అందనుంది. చెన్నూరు ఎత్తిపోతలకు పది టీఎంసీల కాళేశ్వరం జలాలను వినియోగించాలని కేబినెట్‌ నిర్ణయించింది.  
 
ఈ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ...  తెలంగాణ‌లో మ‌రో ఆరు కొత్త ప్రైవేట్ యూనివ‌ర్సిటీల‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింద‌న్నారు. కావేరి అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీకి ఆమోదం ల‌భించిందన్నారు.
 
ఇందుకు సంబంధించిన జీవోలు, విధివిధానాల‌ను సంబంధిత మంత్రులే చూసుకుంటార‌ని చెప్పారు. అలాగే, ఫార్మా యూనివ‌ర్సిటీని త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి తీసుకురావాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింద‌ని సీఎం తెలిపారు.