గురువారం, 7 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2022 (18:47 IST)

పన్ను పీకించుకోవడానికి ఢిల్లీకి ఎందుకు కేసీఆర్.. ఇక్కడే..? ఫైర్‌బ్రాండ్

Vijayashanti
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ చేపట్టిన నిరసన దీక్షను ఉద్దేశించి బీజేపీ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్‌పై కూడా ఆమె విరుచుకుపడ్డారు. 
 
ముఖ్యమంత్రి కేసీఆర్ పంటి చికిత్సపై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. పన్ను పీకించుకోవడానికి ఢిల్లీ వెళ్లారని.. అలాకాకుండా ఆయన ఇటీవల రాష్ట్రంలో చేపట్టిన దీక్షలో పాల్గొని ఉంటే రైతులే పీకేసే వారు కదా.. ఖర్చు కూడా తగ్గేదని వ్యాఖ్యానించారు.  
 
కేసీఆర్ చేసేవన్నీ దొంగ దీక్షలేనని.. రైతులకు, బాయిల్డ్ రైస్‌కి సంబంధమేంటని ప్రశ్నించారు. కల్లాల్లో వరి కుప్పలపై రైతుల ప్రాణాలు పోతున్నా కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడం దారుణమన్నారు. 
 
కల్లాల్లో వరి కుప్పలపై రైతుల ప్రాణాలు పోతున్నా కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడం దారుణమన్నారు. ధాన్యం తక్కువ ధరకు దళారులు కొనుక్కోవాలని చూస్తున్నారని.. అందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఆలస్యం వహిస్తున్నారని ఆమె మండిపడ్డారు.