మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (11:27 IST)

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్టు

revanth reddy
తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆ రాష్ట్ర పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన గురువారం పౌరసరఫరాల భవన్, విద్యుత్ సౌధను ముట్టడించడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా రేవంత్ రెడ్డిని గృహనిర్బంధంలో ఉంచారు. 
 
గురువారం ఉదయం నుంచే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు వ్యతిరేకంగా గురువారం విద్యుత్ సౌధ, పౌరసరఫరాల భవన్‌ను కాంగ్రెస్‌ పార్టీ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. 
 
అంతకుముందు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంధనం, విద్యుత్ చార్జీలను ప్రభుత్వం తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళన ధాటికి ప్రభుత్వంలో వణుకు మొదలైందని, అందువల్లే తమను ముందుగానే గృహ నిర్బంధాల్లో ఉంచుంతుందని ఆయన ఆరోపించారు.