ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జూన్ 2022 (21:08 IST)

ప్రీతమ్ జుకల్కర్‌తో సమంత డేట్‌ నైట్.... ఫ్యాన్స్ షాక్...

samantha
అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత సినిమాలతో బిజీబిజీగా వుంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్, ఐటమ్ సాంగ్స్ అంటూ వచ్చిన అవకాశాలను వచ్చినట్లే ఉపయోగించుకుంటోంది. 
 
అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత, ప్రొఫెషన్ అండ్ పర్సనల్ లైఫ్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుందని తెలిసిందే. 
 
తాజాగా సామ్ పోస్టు వివాదానికి దారి తీసింది. సామ్ తాజాగా తన స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్‌తో కలిసి డేట్ నైట్‌కు వెళ్లింది. వీరిద్దరితో పాటు సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ కూడా ఉండగా.. ఈ ఫొటోలను స్వయంగా సమంతనే 'డేట్ నైట్' క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో షేర్ చేసింది. 
 
ఈ ఇన్సిడెంట్ ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఇవ్వగా.. తన విడాకులకు కూడా అతనే కారణమని ఆ మధ్య పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి. నిజానికి ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పటికీ చైతుతో బ్రేకప్ తర్వాత అనేక రూమర్స్ వినిపించడంతో సామ్, ప్రీతమ్ తీవ్రంగా ఖండించారు. 
 
కానీ ప్రస్తుతం డేట్ నైట్ కోసం అతనితో తిరగడం ఫ్యాన్స్‌కే మింగుడుపడటం లేదు. ఈ కారణంగానే చై వదిలేసి వుంటాడని చర్చించుకుంటున్నారు. మరి ఈ వివాదానికి సమంత ఏం సొల్యూషన్ ఇస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.