ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 21 ఆగస్టు 2022 (14:51 IST)

మెగా ఫ్యాన్సుకు బిగ్ ట్రీట్.. రిలీజ్ డేట్‌ రిలీజ్

Chiranjeevi
Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేను పురస్కరించుకుని మెగా ఫ్యాన్స్‌కు ట్రీట్ రెడీ అయ్యింది. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కావడంతో భోళాశంకర్ సినిమా రిలీజ్ డేట్‌ని రివీల్ చేశారు చిత్ర యూనిట్. 
 
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు. 2023 ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ సినిమా తమిళ సూపర్‌ హిట్‌ సినిమా వేదాళంకి రీమేక్‌గా తెరకెక్కుతుంది. 
 
ఇందులో చిరంజీవి సరసన తమన్నా నటిస్తుండగా, చిరు చెల్లెలిగా కీర్తి సురేశ్‌ నటిస్తుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా.