బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (16:02 IST)

రూ.కోట్లు కొల్లగొడుతున్న "విక్రాంత్ రోణ"

Vikrant Rona
కన్నడ నటుడు కిచ్చా సుధీప్ హీరోగా నటించిన కొత్త చిత్రం "విక్రాంత్ రోణ". గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో విజయపథంలో దూసుకెళుతోంది. ఫలితంగా కేవలం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. 
 
గత నెల 28వ తేదీన విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టడంతో నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే రూ.29 కోట్లు రాబట్టింది. దీంతో తొలి వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.115-120 కోట్ల మేరకు రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
 
కాగా, "విక్రాంత్ రోణ" తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. రూ.95 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు. కన్నడ చిత్రపరిశ్రంలో భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాల్లో ఒకటిగా "విక్రాంత్ రోణ" నిలిచింది. జీ స్టూడియోస్ సమర్పణలో జాక్ మంజునాథ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.