బుధవారం, 21 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (19:49 IST)

అలాంటి రూల్స్ పెట్టుకోను.. నూటికి వంద శాతం న్యాయం చేస్తా.. సాయిపల్లవి

saipallavi
ఫిదా, లవ్ స్టోరీ, విరాటపర్వం సినిమాలలో సాయిపల్లవి అభినయ ప్రధాన పాత్రల్లో నటించారు. గార్గి సినిమా కమర్షియల్‌గా సక్సెస్ సాధించకపోయినా సాయిపల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే కథ, పాత్రల ఎంపిక గురించి సాయిపల్లవి తాజాగా మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. 
 
ఏదైనా రోల్‌ను ఇదే విధంగా చేయాలని రూల్ పెట్టుకోనని సాయిపల్లవి స్పష్టం చేశారు. సినిమాలో చేసే రోల్ కోసం నూటికి నూరు శాతం న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తానని సాయిపల్లవి స్పష్టం చేశారు. 
 
సినిమాలో చేసే రోల్ కోసం నేను ముందుగానే సన్నద్ధం కానని సాయిపల్లవి కామెంట్లు చేశారు. తోటి నటీనటులు, సెట్ వాతావరణంపై ఆధారపడి తన నటన ఆధారపడి ఉంటుందని సాయిపల్లవి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సాయిపల్లవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.