గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (13:44 IST)

విజయ్‌ దేవరకొండతో సినిమానా? ముద్దులుంటాయ్.. వద్దుబాబోయ్!

Sai Pallavi
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు మాస్ ఫాలోయింగ్ వుంది. విజయ్ దేవరకొండ అంటే కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఈయనకు అభిమానులుగా మారిపోయారు. ముఖ్యంగా ఎంతోమంది హీరోయిన్లు సైతం విజయ్ దేవరకొండ తమ క్రష్ అని, తనతో డేట్ చేయాలని ఉందంటూ ఓపెన్ అయ్యారు. 
 
విజయ్‌తో నటించేందుకు చాలామంది హీరోయిన్లు రెడీ అంటున్నారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం తనకు అవకాశం వచ్చినా ఆ ఛాన్సును సున్నితంగా తిరస్కరించింది.
 
ఇలా తన సినిమాలో నటించే అవకాశాన్ని రిజెక్ట్ చేయడమే కాకుండా, భవిష్యత్తులో విజయ్ దేవరకొండతో కలిసి సినిమాలలో నటించినని తెగేసి చెప్పేసిందట. ఆమె ఎవరో కాదు ఫిదా భామ సాయిపల్లవి.
 
కాగా సాయి పల్లవి విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఇందులో ముద్దు సన్నివేశాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఆమె ఆ ఛాన్సును వదులుకుందని టాక్ వస్తోంది.  భవిష్యత్తులో కూడా విజయ్‌తో సినిమాలు చేసేది లేదని సాయిపల్లవి సన్నిహితులతో తెగేసి చెప్పినట్లు సమాచారం.