గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 జులై 2022 (13:35 IST)

బోనమెత్తిన సాయిపల్లవి.. #Happybonam ఫోటో వైరల్

Sai Pallavi
Sai Pallavi
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ప్రతిఏటా ఆషాడమాసంలో బోనాల పండుగను నిర్వహిస్తారు. తాజాగా రానా సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. ఈ సినిమాలో కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకులు. ఈ క్రమంలోనే సాయి పల్లవి ఈ సినిమాలో సాంప్రదాయ దుస్తులైన లంగా వోని ధరించి బోనం ఎత్తుకొని వచ్చే సన్నివేశాలు అందరిని ఆకట్టుకున్నాయి.
 
అయితే నేడు బోనాలు స్పెషల్ కావడంతో దర్శకుడు వేణు సాయి పల్లవి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికీ #Happybonam అనే హ్యాష్‌ట్యాగ్‌తో డైరెక్టర్‌ వేణు ఊడుగుల శుభాకాంక్షలు తెలియజేశారు.
 
తెలంగాణ గ్రామీణ జీవన సంస్కృతికి, ప్రకృతికి పర్యావరణానికి తెలంగాణ ఆడబిడ్డలు తీర్చుకునే మొక్కు బోనాల పండుగ ఇది.. అంటూ ఈయన సాయి పల్లవి బోనం ఎత్తిన ఫోటోని షేర్ చేశారు. 
 
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలా సాయి పల్లవి అచ్చం తెలంగాణ ఆడపడుచుల బోనం ఎత్తుకున్న ఫోటో చూసి అందరూ ఫిదా అవుతున్నారు.