మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

నిత్య పెళ్లికొడుకు ... వయసు 28 యేళ్లు - వివాహాలు 24... ఎక్కడ?

marriage
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ నిత్య పెళ్లి కుమారుడి కథ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ పెళ్ళి కుమారుడి వయస్సు 28 యేళ్లు. కానీ చేసుకున్న వివాహాల సంఖ్య 24. రోజుకో కొత్త పేరుతో తిరుగుతూ, యువతులను మభ్యపెట్టి వరుస పెళ్లిళ్లు చేసుకోసాగాడు. 
 
అలా దేశ వ్యాప్తంగా 23 మంది యువతులను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. 24వ పెళ్లిని వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్, సాగర్ దిగీ ప్రాంతంలో చేసుకున్నాడు. వివాహం తర్వాత వధువు ఇంట్లో నగలు, నగదు తీసుకుని పారిపోయాడు. 
 
దీంతో బాధితురులా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు పెళ్లయిన కొన్నాళ్లకు ఇంట్లోని నగలు, డబ్బులు తీసుకుని పరారయ్యేవాడు. 24వ భార్య మాత్రం ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతణ్ని పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపతున్నారు.