శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2022 (19:53 IST)

తొమ్మిదేళ్ల బాలికపై పక్కింటి వ్యక్తి అత్యాచారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో?

తొమ్మిదేళ్ల బాలికపై పక్కింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. బాలిక గత రెండు నెలలుగా తరచుగా అనారోగ్యానికి గురవుతుండటంతో తల్లిదండ్రులు బాలికను విచారించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
రంగారెడ్డి జిల్లాకు చెందిన బాలికపై ఆమె తల్లిదండ్రులు బయటికి వెళ్లినప్పుడల్లా పొరుగు ఇంట్లో నివసించే బీహార్ వ్యక్తి తరచూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడని బాధితురాలు తెలిపింది. 
 
దీంతో తల్లిదండ్రులు సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.