గురువారం, 9 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated: శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (08:30 IST)

న్యూడ్ వీడియో చూపించి బెదిరిస్తున్న యువతి.. ఎక్కడ?

video
ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. గుర్తు తెలియని నంబరు నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ అంటెండ్ చేయడమే యువకుల పొరపాటు. ఆ తర్వాత సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకుని నానా తిప్పలు పడుతున్నారు. తాజాగా ఓ యువకుడిని ఫోన్ చేసిన ఓ యువతి తియ్యని మాటలు చెప్పపడంతో ఆమె వలలో పడిపోయాడు. 
 
ఆ తర్వాత దుస్తలు విప్పేసి వీడియో కాల్‌లో మాట్లాడిన కుర్రోడు... చివరకు ఆ మాయాలేడికి దొరికిపోయాడు. ఇక అక్కడ నుంచి యువతి బెదిరింపులకు శ్రీకారం చుట్టంది. డబ్బులు ఇవ్వకుంటే నీ నగ్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తామంటూ బెదిరించింది. ఇది హైదరాబాద్ నగరంలో జరిగింది. ఇలాంటి ఘటనే ఒకటి ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో జరిగింది. 
 
తాజాగా భాగ్యనగరంలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన యువకుడు (26) ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఇటీవల అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతితో పరిచయమైంది. అది క్రమంగా పెరిగి ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకుని నిత్యం ముచ్చట్లు చెప్పుకునే వరకు వెళ్లింది.
 
యువకుడు తన వలలో పడినట్టు నిర్ధారణకొచ్చిన తర్వాత ఆమె తన ప్రణాళికను అమలు చేయడం మొదలుపెట్టింది. తొలుత వాట్సాప్ వీడియో కాల్‌ చేసి మాట్లాడింది. మరోసారి దుస్తులు పూర్తిగా విప్పేసి కాల్ చేసింది. అతడిని కూడా దుస్తులు తొలగించమని కోరింది. 
 
అమ్మాయే అలా మాట్లాడితే తానేం తక్కువ కాదని అనుకున్నాడో ఏమో! ఆమె అడిగిందే తడవుగా దుస్తులు విప్పేసి చాలాసేపు మాట్లాడాడు. అందుకోసమే ఎదురుచూస్తున్న మాయలాడి ఆ వీడియోను క్యాప్చర్ చేసింది.
 
తన చేతికి యువకుడి నగ్న వీడియోలు చిక్కడంతో ఆమె తన అసలు రూపాన్ని బయటపెట్టింది. వీడియోలను అతడికి పంపి డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయకుండా ఉండాలంటే డబ్బులు చెల్లించుకోవాల్సిందేనని బెదిరించింది. 
 
అప్పటి నుంచి రూ.5 వేలు, రూ.10 వేలు పంపాలని మెసేజ్‌లు పంపింది. దీంతో విసిగిపోయిన యువకుడు గురువారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
ఇక్కడ మరో గమ్మత్తైన విషయం ఏంటంటే.. వారి మధ్య పరిచయం కేవలం నాలుగు రోజులే కావడం గమనార్హం. ఈ నాలుగు రోజుల్లోనే ఆ యువతి ఆ యువకుడిని నగ్న వీడియోలు చూపిస్తూ బెదిరించసాగింది.