గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 24 సెప్టెంబరు 2022 (16:43 IST)

బాలికల సాధికారిత దిశగా ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌ కార్యక్రమం ప్రారంభించిన ఆకాష్‌ బైజూస్‌

Aakash
టెస్ట్‌ ప్రిపరేటరీ సేవలలో అగ్రగామి సంస్థ ఆకాష్‌ బైజూస్‌ తమ ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌ కార్యక్రమం ద్వారా ఉచితంగా నీట్‌, జెఈఈ కోచింగ్‌ అందించేందుకు ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు, మరీముఖ్యంగా బాలికలు లబ్ధి పొందవచ్చు. ఈ విద్యార్థుల ఎంపిక కోసం ANTHE శీర్షికన ఓ పరీక్షను నవంబర్‌ 5-13 తేదీలలో దేశ వ్యాప్తంగా 285 కేంద్రాలలో ఆన్‌లైన్‌లో నిర్వహిచబోతుంది. ఈ పరీక్షలలో మెరుగైన ప్రతిభను కనబరిచిన విద్యార్ధులకు ఉచితంగా శిక్షణ అందించనున్నారు.
 
ఈ ప్రవేశ పరీక్ష గురించి ఆకాష్‌ బైజూస్‌ డైరెక్టర్‌ ఆకాష్‌ చౌదరి మాట్లాడుతూ నీట్‌, జెఈఈ పరీక్షలలో సత్తా చాటాలని కోరుకుంటున్నప్పటికీ ఆర్థికపరమైన అవరోధాల కారణంగా ప్రతికూలతలు ఎదురవుతున్న విద్యార్ధులకు తోడ్పడేందుకు ఈ స్కాలర్‌షిప్‌ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ANTHE ప్రారంభమైన నాటి నుంచి 33 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించామంటూ నవంబర్‌ 6, 13 తేదీ రెండు సెషన్‌లుగా ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ఇంజినీరింగ్‌, మెడిసన్‌లలో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు తమ ఆసక్తికనుగుణంగా ప్రవేశ పరీక్ష సమయం ఎంచుకుని రాయాల్సి ఉంటుంది. మల్టీపుల్‌ ఛాయిస్‌ రూపంలో 90 మార్కులకుగానూ ఈ పరీక్ష జరుగుతుంది.