గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2022 (14:25 IST)

కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు సేవించిన చిన్నారి

deadbody
ఓ ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగింది. దీంతో అపస్మారకస్థితిలోకి జారుకుంది. బాలికను గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన ఆసిఫాబాద్ మండలం భీంపూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భీంపూర్ గ్రామానికి చెందిన రాజేశ్, లావణ్య దంపతులకు శాన్వి గుండి అనే ఐదేళ్ళ బాలిక వుంది. ఈ చిన్నారి స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు స్కూల్‌లు ఎల్కేజీ చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో పెద్దనాన్న ఇంటిలో ఆట్లాడుకుంటోంది. 
 
ఆ సమయంలో తన కంటికి కనిపించిన ఓ బాటిల్‌లోని ద్రావకాన్ని తాగేసింది. అయితే, కూల్‌డ్రింక్ అని భావించి ఆ చిన్నారు తాగేసింది. దీంతో ఆ బాలిక అపస్మారక స్థితిలోకి చేరుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. తమ బిడ్డను బతికించుకునేందుకు తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.